తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా ,దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో లక్కీ మీడియా పతాకం ఫై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘హుషారు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ఆడియో శ్రోతలను అలరిస్తున్నాయి.
‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రధాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ పాడిన ‘ఉండిపోరాదే’ పాట ఇప్పటికే పెద్ద హిట్ అయ్యి 5 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను రాబట్టింది. రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది.


