లక్కీ మీడియా బ్యానర్ లో ‘హుషారు’ !

Published on Jul 24, 2018 11:16 am IST

నూతన దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘హుషారు’. ఈ చిత్రం లోగోను అగ్రనిర్మాత ‘దిల్ రాజు’ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – ”మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఇది. కథా కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా , ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష ఎక్స్ లెంటుగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు . షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆగష్టు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని, పూర్తి వివరాలును త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

ఐతే బెక్కెం వేణుగోపాల్ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించి.. లక్కీ మీడియా సంస్థలో ‘మేము వయసుకు వచ్చాం’ ‘ సినిమా చూపిస్త మావ’ లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో అంతా నూతన తారలనే పెట్టి 9వ చిత్రంగా ‘హుషారు’ నిర్మిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ , ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :