డిసెంబర్ 7న ‘హుషారు’ !

డిసెంబర్ 7న ‘హుషారు’ !

Published on Nov 15, 2018 3:09 AM IST

నూతన దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘హుషారు’. ప్రధానంగా యూత్ కి కనెక్ట్ అంశాలతో, కథా కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా , ట్రెండీగా ఈ సినిమా తెరకెక్కుతుందని చిత్రబృందం చెబుతుంది. కాగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్, ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేస్తుండం విశేషం.

ఇక లక్కీ మీడియా సంస్థ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న బెక్కెం వేణుగోపాల్ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించి.. ‘మేము వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్త మావ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ హుషారు చిత్రాన్ని డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు