నాకు దేవుడంటే భయం – పవన్ కళ్యాణ్

నాకు దేవుడంటే భయం – పవన్ కళ్యాణ్

Published on Jan 15, 2015 6:34 PM IST

Pawan-Kalyan-new-look
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి తాజాగా వచ్చిన సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ శ్రీ కృష్ణుడు గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో వెంకటేష్ ముఖ్య పాత్రని పోషించాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తనకి దేవుడంటే భయం అంటున్నాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి దేవుడంటే భయం. అందుకే చిన్నప్పుడు ఏమన్నా తప్పు చేస్తే వెంటనే అమ్మకి చెప్పేసే వాడిని. అప్పటి నుంచీ ఇప్పటికీ దేవుడంటే కొంచెం భయం. కానీ నా దేవుడికి రూపం ఉండదని’ అన్నాడు.

వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని సెంటర్స్ లోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా ఈ సినిమా చూసి బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రియ ఓ ముఖ్య పాత్ర పోషించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది.

తాజా వార్తలు