నేను సెల్ఫిష్ కాదంటున్న రెజీనా

నేను సెల్ఫిష్ కాదంటున్న రెజీనా

Published on May 4, 2014 1:00 PM IST

Regina
చిన్న సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రెజీన కసాండ్రా హీరోయిన్ గా నటించిన ‘కొత్త జంట’ గత గురువారం విడుదలైంది. ఈ సినిమాలో రెజీనా నటనకి అందరి నుంచి మంచి ప్రశంశలు దక్కాయి. మారుతి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మధురిమ, సప్తగిరి, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటించారు.

రెజీన మీడియాతో మాట్లాడుతూ ‘కొత్త జంటలో సెల్ఫిష్ అమ్మాయి పాత్ర చేసాను. కానీ నేను రియల్ లైఫ్ లో సెల్ఫిష్ కాదు. వర్క్ విషయంలో నేను చాలా ఫోకస్ గా ఉంటానని’ తెలిపింది. కొత్త జంట సినిమా కాకుండా రెజీన నటించిన ‘పవర్’, ‘రారా కృష్ణయ్య’, ‘శంకర’ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి.

రెజీన తన కెరీర్ గురించి మాట్లాడుతూ ‘నా కెరీర్ ని తమిళ్ లో ప్రారంభించాను. తెలుగు సినిమాలపైన దృష్టి పెట్టాలన్నది నేను తీసుకున్న నిర్ణయమే. ప్రస్తుతం న్న నా కెరీర్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నానని’ తెలిపింది.

తాజా వార్తలు