బయోపిక్ లో కూడా బోల్డ్ రోలేనా !

Published on May 26, 2019 10:44 am IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ వేశ్య పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ ఈ పాత్ర గురించి మాట్లాడుతూ రాణీ ముఖర్జీ, టబు, అనుష్క వంటి స్టార్స్‌ కూడా వేశ్య పాత్రలు చేశారు. వారి సినిమాలు చూశాను. కానీ నా స్టైల్‌ లోనే ఆ పాత్రను చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

పాయల్ ఇంకా మాట్లాడుతూ.. వారి జీవితం అంత ఈజీగా సాగదు. వాళ్ళు కేవలం డబ్బు కోసం, లగ్జరీల కోసం అలాంటి పనులు చేస్తున్నారంటే అది కరెక్ట్‌ కాదు. ఏది ఏమైనా ఎవరి జీవితం వారిష్టం. అని తెలిపింది. ఇక ‘టైగర్ నాగేశ్వర్రావు’ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More