నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ను వన్ వీక్ లో దాటేస్తున్నాం – మహేశ్ బాబు

Published on May 12, 2019 2:43 pm IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నైజాం లాంటి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. కాగా చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.

ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణమయిన తన అభిమానులు మరియు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థాంక్స్. ఈ రోజు మదర్స్ డే..నాకు చాలా స్పెషల్ డే. నాకు మా అమ్మగారంటే దైవంతో సమానం. ఎప్పుడూ సినిమా మొదలుపెట్టినా.. ఆమె దగ్గరికి వెళ్లి కాఫీ తాగితే.. నాకు ఎదో ప్రసాదం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే దేవి మ్యూజిక్ గురించి చెప్పాలి. తనంటే నాకు ప్రాణం. అంతబాగా ఈ సినిమాకి తను పని చేశాడు. మా నిర్మాతలందరికీ ఇంతమంచి సినిమాను నాకు ఇచ్చినందుకు చాలా థాంక్స్ సర్. నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ను వన్ వీక్ లో దాటేస్తున్నాం. వంశీ నాకు ఎప్పటికి మర్చిపోలేని హిట్ ఇచ్చాడు’ అని తెలిపారు.

సంబంధిత సమాచారం :

More