ఢిల్లీకి చెందిన అందాల భామ అవంతిక మొదటి చాన్స్ నేషనల్ అవార్డు విన్నర్ అయిన నీలకంఠ డైరెక్షన్ లో చేసే అవకాశం కొట్టేసింది. ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ‘మాయ’ సినిమాలో అవంతిక ఓ లీడ్ హీరోయిన్ గా నటించింది.
అవంతిక తన మొదటి సినిమా గురించి చెబుతూ ‘ నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చే పాత్ర మాయ సినిమాలో చేసాను. ఎవరికీ మొదటి సినిమాతోనే ఇలాంటి ఆఫర్ రాదు. నాకు చాలా చాలెంజింగ్ గా అనిపించింది. సినిమా చూసాక అది మీకు అర్థమవుతుంది. నేను షూటింగ్ సెట్ ని యాక్టింగ్ స్కూల్ లా ఫీల్ అయ్యే దాన్ని. మొదర్లో బాగా నర్వస్ గా ఉండేది కాని చివరికల్లా కెమెరా ముందు ఎలా బిహేవ్ చెయ్యాలి, ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి అనే వాటి మీద అవగాహన వచ్చేసిందని’ చెప్పింది.
అలాగే నీలకంఠ గారి స్క్రిప్ట్ చాలా ఫ్రెష్ గా ఉంటుందని, కథలో రొమాన్స్, కామెడీని బాగా మిక్స్ చేసారని చెప్పింది. అలాగే ఈ సినిమా కోసం బాగా కష్టపడిన సీన్ గురించి చెబుతూ ‘నేను న్యూ ఇయర్ రోజున జరిగే సీన్స్ లో రెండు రోజులు యాక్ట్ చేసాను. దానివల్ల నాకు ఆరోగ్యం కాస్త దెబ్బ తినింది. నేను ఎప్పుడూ అంతలా జబ్బు పడలేదు. అలాగే ఆ షూట్ ఎండ్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంది. నాకు అది చేయగల కెపాసిటీ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదని’ అవంతిక చెప్పింది.


