
బాలీవుడ్లో అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో వచ్చిన హిట్ మూవీ ‘డిల్లీ బెల్లీ’ కి రిమేక్ గా తమిళంలో ‘సెట్టై’ పేరుతో తెరకెక్కుతోంది. ఆర్య, సంతానం, ప్రేమ్ జీ అమరన్, హన్సిక మరియు అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘సెట్టై’ సినిమా మొదటి టీజర్ ని ఇటీవలే విడుదల చేసారు. ఈ టీజర్లో ఆర్య మరియు హన్సిక మధ్య బెడ్ సీన్స్ ఉండడంతో సినిమాలో మంచి హాట్ బెడ్ రూమ్ సీన్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై హన్సిక ఘాటుగా స్పందించారు. ‘ ప్రస్తుతం నా కెరీర్ ఉన్న జోరుకి నాకు బెడ్ రూమ్ సీన్స్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మరియు సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు ఉండవని’ హన్సిక అన్నారు. హిందీ వెర్షన్లో ఎంటర్టైనింగ్ తో పాటు అడల్ట్ అంశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇందులో అలాంటివి ఏమీ లేవనడం ప్రేక్షకులను కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం హన్సిక తెలుగులో మంచు విష్ణు సరసన నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
బెడ్ రూమ్ సీన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు : హన్సిక
బెడ్ రూమ్ సీన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు : హన్సిక
Published on Oct 1, 2012 11:06 AM IST
సంబంధిత సమాచారం
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ప్రభాస్ ఎంట్రీ సీన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !
- ‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట విడుదల
- ‘డ్రాగన్’ పై ఆ పుకార్లు.. వాస్తవం లేదట !
- దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఏకంగా 24 గంటల్లో 5 లక్షలకు పైగా !
- ఓటీటీ : ‘న్యూటన్స్ థర్డ్ లా’ స్ట్రీమింగ్ కి రెడీ !
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ‘రౌడీ జనార్దన’లో అసలైన బలం అదే !
- ప్లాప్ లో ఉన్నప్పుడు ఇంత రిస్క్ అవసరమా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్

