నేనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను – ఏఆర్‌ రెహమాన్‌

నేనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను – ఏఆర్‌ రెహమాన్‌

Published on Nov 4, 2018 6:52 PM IST

ఏఆర్‌ రెహమాన్‌.. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన సంగీత మాంత్రికుడు మరియు ఆస్కార్‌ గ్రహీత. మరి ఇంతటి ప్రతిభావంతుడు కూడా ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో చాలా రోజులు గడిపాడంటే నమ్మలేం కదా.. కానీ ఇది అక్షర సత్యం అని రెహమానే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను, తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ ప్రముఖ వార్త సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల గురించి రెహమాన్‌ మాట్లాడుతూ.. ‘నాకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఆత్మహత్య చేసుకోవాలని తరుచు ఆలోచించేవాడిని. నాకు ఆ ఆలోచనలు రావడానికి కారణం.. మేం మా నాన్నగారిని కొల్పోయాక, మాకు ఎదురైన పరిణామాలే, మేం పడిన ఇబ్బందులే.. నన్ను ఆ దిశగా ఆలోచించేలా చేశాయి.

కానీ ఆ తర్వాత నా ప్రయాణం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఎవరి జీవితంలోనైనా అంతే.. సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం అని రెహమాన్‌ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు