యానిమల్ స్టోరీ విని షాక్ అయ్యాను – రణబీర్ కపూర్

Published on Mar 9, 2023 3:04 am IST


రౌడీ హీరో విజయ దేవరకొండ హీరోగా 2017లో క్రేజీ బ్లాక్‌బస్టర్ అర్జున్ రెడ్డి తెరకెక్కించి దర్శకుడిగా ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ అందుకున్నారు సందీప్ రెడ్డి వంగా. అనంతరం ఈ సినిమాని హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసి అక్కడ కూడా అద్భుతమైన హిట్ అందుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో యానిమల్‌ చేస్తున్నారు సందీప్. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ ఆగస్టు 11, 2023 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే హిందీతో పాటు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో పలు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది.

ఇక ఇటీవల ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా హీరో రణ్‌బీర్‌ కపూర్‌ యానిమల్ మూవీ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కథ నటుడిగా తనను కదిలించిందని, నటుడిగా తాను ఇటువంటి పాత్ర ఎప్పుడూ చేయలేదని రణబీర్ అన్నారు. యానిమల్‌లో తాను పోషించే పాత్రలో గ్రే షేడ్స్ ఉన్నాయని రణబీర్ పేర్కొన్నారు. ఒక నటుడికి యానిమల్ లాంటి సినిమాలు చాలా అవసరమని, దీని వల్ల కెరీర్ పరంగా సరికొత్తగా ప్రయత్నించి మరింత ముందుకు దూసుకెళ్లే అవమాశం ఉందని ఆయన తెలిపారు. యానిమల్‌లో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా యాక్షన్‌తో ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :