తెలుగు సినిమాకి సైన్ చేయలేదన్న కమల్ హాసన్

kamal-hassan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తెలుగులో తను ఓ డైరెక్ట్ సినిమా చేయనున్నాడని వస్తున్న వార్తలను కొట్టిపారేసాడు. ఇటీవలే డైరెక్టర్ తేజ రిలీజ్ చేసిన ఓ ప్రెస్ నోట్ లో తను కమల్ హాసన్ తో ఓ సినిమా చేయనున్నాడని, అది వచ్చే సంవత్సరం మొదలవుతుందని పేర్కొన్నాడు.

ఈ విషయం పై స్పందించిన కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ నేను ఓ తెలుగు సినిమాకి సైన్ చేసానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం నేను కొంతమంది తెలుగు డైరెక్టర్స్ చెప్పిన కథలు విని డిష్కషన్స్ చేస్తున్నాను, కానీ ఇంకా దేనికీ సైన్ చెయ్యలేదు. ఒకవేళ నేను తెలుగులో సినిమా చేస్తే అది నా సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో చేస్తానని’ అన్నాడు.

కానీ కొద్ది రోజుల క్రితం తేజ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ మాత్రం కమల్ హాసన్ స్టేట్మెంట్స్ కి పూర్తి విరుద్దంగా వచ్చింది. ఇప్పుడు ఈ విషయంపై తేజ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది చూడాలి..

Exit mobile version