విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐ’ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతుంది. సుమారు 180 కోట్ల నిర్మాణ వ్యయంతో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారి ఎత్తున విడుదల చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలను కూడా అంతే భారిగా నిర్వహిస్తున్నారు.
నిన్న బెంగుళూరు, నేడు కొచ్చి, రేపు మరో నగరం.. ఇలా ఇండియా మొత్తం ‘ఐ’ ప్రమోషన్ నిమిత్తం చుట్టేస్తున్నారు హీరో హీరోయిన్లు విక్రమ్ & అమీ జాక్సన్. ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలను భారి ఎత్తున నిర్వహించి సినిమాపై అందరి దృష్టిని ఆకర్షించారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది ప్రచార జోరు – హోరు పెంచారు.
హాలీవుడ్ సినిమాలకు దీటుగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉండడంతో ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.


