విక్రమ్, అమీ జాక్సన్ లు జంటగా నటించిన ‘ఐ’ సినిమా బిజినెస్ ఆంద్రప్రదేశ్ లో డైరెక్ట్ తెలుగు సినిమాలనూ తలదన్నే రీతిలో జరుగుతుంది. రిలీజ్ డేట్ లు ప్రకటించకపోయినా ఈ బిజినెస్ అమోఘం. మొత్తం ఆంద్ర, తెలంగాణాలు కలిపి 5.75 కోట్లకు పంపిణీదారులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర హిందీ వెర్షన్ హక్కులు సైతం ఇదే రీతిలో బిజినెస్ చేస్తున్నాయి. బాలీవుడ్ నటి రవీనా టాండన్ భర్త, ప్రముఖ డిస్త్రిబ్యుటర్ అనీల్ తాదాని హిందీహక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది
‘ఐ’ సినిమా గ్రాఫికల్ మాయాజాలంగా తెరకెక్కుతుంది. ఇందులో విక్రమ్ పోషించిన బీస్ట్ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం ఇప్పటికే శ్రోతల మన్నలని అందుకుంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ త్వరలో మనముందుకు రానుంది


