
టాలీవుడ్ కొత్త విలన్ గా జగపతిబాబు డిమాండ్ లో వున్నాడు. లేజెండ్ సినిమాలో ఆటను నటించిన నటన సినిమా విజయానికి దోహదపడడంతో వేరే భాషల నుండి విలన్లను తెచ్చుకునే అవసరం లేకుండా దర్శకుల ఎంపికగా మారాడు
కానీ ఈ నటుడు తన కెరీర్ మొత్తం విలన్ గా కొనసాగించడం ఇష్టం లేదని అన్నాడు “ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు అంటే ప్రస్తుహ్తానికి నాలో ఏదో కొత్తదనం వుండబట్టి. దర్శకులు కూడా మన భాషవాడే అని నన్ను ఏమిప్క చేసుకుంటూ ఉండచ్చు కానీ నేను విలన్ గా కొనసాగాలేను. రాజనాల, సత్యనారాయణ వారసులు అనిపించుకోవడం అంత తేలిక కాదు. నేను బోర్ కొట్టినప్పుడు ప్రేక్షకులు నన్ను పట్టించుకోరు” అని నిర్మొహమాటంగా చెప్పేసాడు
జగపతిబాబు ప్రస్తుతం పిల్లా నువ్వు లేని జీవితం మరియు మహేష్ బాబు నటిస్తున్న సినిమాలలో కనిపించనున్నాడు

