‘ఐ’ సినిమా కోసం రెండేళ్ళ పాటు ఇండియాలో చాలా ప్రదేశాలు తిరిగిన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్.. ఇక్కడ సంస్కృతితో ప్రేమలో పడిపోయానని చెప్తుంది. ‘ఐ’ సినిమాలో కొన్ని సన్నివేశాలలో పదహారణాల పల్లెటూరి అమ్మాయిగా నటించానని, చీరకట్టు తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. పెళ్లి విషయం ప్రస్తావించగానే.. నేను భారతీయ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానెమో..! మీకు తెలియదు అంటూ ఓ ప్రముఖ తమిళ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీ జాక్సన్ వ్యాఖ్యానించింది. ఇండియాలో వరుసగా సినిమా అవకాశాలు లభించడంతో తన మకాం ముంబైకి మార్చేసింది. ప్రస్తుతం తల్లితో కలిసి ముంబైలో ఉంటుంది.
శంకర్ దర్శకత్వంలో అమీ హీరోయిన్ గా నటించిన ‘ఐ’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. తనకు ‘ఐ’ సినిమా పెద్ద బ్రేక్ తీసుకొస్తుందని ఆశిస్తుంది. చక్కని కథ, భారి తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ‘ఐ’ సినిమా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటుందని సెలవిచ్చింది.


