శంకర్, విక్రమ్ ల అభిమానులు, భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఐ’ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. గతంలో ఏ దక్షిణాది సినిమాకు లేనంతగా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నో విడుదల తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు సంక్రాంతి బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకొనుంది.
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ విజువల్ వండర్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ రోజు ‘ఎ రెడ్ లెటర్ డే ఫర్ ఇండియన్ సినిమా’ అంటూ అభివర్ణించారు.
తమిళ, తెలుగు, హిందీలతో పాటు పలు విదేశి భాషలలో ఈ సినిమాను భారి ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ సన్నాహాలు చేస్తున్నారు. ఏఅర్ రెహమాన్ స్వరపరిచిన తమిళ ఆడియో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు ఆడియో త్వరలో విడుదల చేయనున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై తెలుగులో ఈ సినిమాను అనువదిస్తున్నారు.
9th January 2015 we will all be blessed with "I". A red letter day for Indian cinema. pic.twitter.com/CRywazovFl
— pcsreeram (@pcsreeram) December 14, 2014


