వద్దనుకున్న భాషలోనే హీరోయిన్ అయిన అందాల రాక్షసి .!

వద్దనుకున్న భాషలోనే హీరోయిన్ అయిన అందాల రాక్షసి .!

Published on Sep 2, 2014 8:31 PM IST

Lavanya
‘అందాల రాక్షసి’ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోకపోయినా లావణ్య త్రిపాటికి మాత్రం తెలుగులో మరచిపోలేని గుర్తింపుని తెచ్చి పెట్టింది. లావణ్య తెలుగులో 11 నెలల క్రితం వచ్చిన ‘దూసుకెళ్తా’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సరైన అవకాశం కోసం ఎదురు చూసిన లావణ్య ప్రస్తుతం తెలుగు, తమిళంలో కలిసి 3 సినిమాలు చేస్తోంది.

అసలు ఫిలిం ఇండస్ట్రీలోకే రాను అనుకున్న లావణ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదికూడా అస్సలు రాను అనుకున్న సౌత్ ఇండియన్ సినిమాల్లో.. ‘నేను మోడల్ గా ఉన్నప్పుడు ఓ యాడ్ షూటింగ్ లో తెలుగులో డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. అది చెప్పడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత మళ్ళీ నేను సౌత్ లో కనిపితానని అనుకోలేదు కానీ నేను తెల్లుగు సినిమాలోనే నటించి గుర్తింపు తెచ్చుకున్నానని’ లావణ్య తెలిపింది.

లావణ్య తెలుగులో ‘కేరింత’ సినిమా చేస్తుంటే తమిళంలో వైభవ్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో వేరు వేరు దర్శకులతో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు