కమల్ హాసన్ గారి విశ్వరూపాన్ని చూశాను – జూ.ఎన్టీఆర్

కమల్ హాసన్ గారి విశ్వరూపాన్ని చూశాను – జూ.ఎన్టీఆర్

Published on Jun 11, 2018 4:25 PM IST

విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విశ్వరూపం-2’. ఎన్నాళ్ళగానో మేకింగ్లో ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు పూర్తైంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సినిమా టీజర్ ను విడుదలచేయనున్నారు. అభిమానులంతా టీజర్ ఎలా ఉంటుందో చూడాలని గత రెండు మూడు రోజులగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వెర్షన్ టీజర్ ను విడుదలచేయాల్సిన జూ.ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితమే టీజర్ ను వీక్షించిన విశ్వరూపం-2 టీజర్లో కమల్ హాసన్ గారి విశ్వరూపాన్ని చూశాను. త్వరగా ఆ టీజర్ ను మీతో పంచుకోవాలని ఉంది. 5 గంటల వరకు ఓపిక పట్టండి అంటూ ఆ ఉత్కంఠను ఇంకాస్త పెంచేశారు. కమల్ నటించడమేగాక కథను రాసి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 10న విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు