ఇంటర్వ్యూ : సుశాంత్ – నేను ఇప్పుడు స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాను!

Published on Jul 30, 2018 12:52 pm IST

యువ హీరో సుశాంత్, రుహాని శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చి ల సౌ’. ఈచిత్రం ఆగష్టు 3 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంధర్బంగా చిత్ర హీరో సుశాంత్ మీడియాతో మాట్లాడారు ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం….

మీరు మీ కెరీర్లో ఏమి మార్చారు?
నేను అవే పాత మాస్ సినిమాలు చేయడం విసుగు తెప్పించింది . నా వయసుకు సరిపోయే లవ్ స్టోరీ లతో డిఫ్రెంట్ గా సినిమాలు చేస్తే తప్ప, ప్రేక్షకులు నన్ను ఇష్టపడుతున్నారని లేదా అని నాకు తెలుస్తుంది . ఆ కారణంతో రాహుల్ చెప్పిన ఈ ‘చి ల సౌ’ కథను ఓకే చేసి ఈ చిత్రం చేయడానికి అంగీకరించాను.

మీ హోమ్ బ్యానర్లో ఎందుకు ఈ చిత్రం చేయలేదు?

నేను స్వతహాగా రిస్క్ తీసుకోవాలని అలాగే రాహుల్ కూడా కొత్త నిర్మాతలవైపే మొగ్గు చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇక నా స్నేహితుడు కొంత సహాయం చేయడంతో ఈ చిత్రానికి నిర్మాతలు దొరికారు . ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత నాగ చైతన్య ఈ సినిమాను చూసి ఇష్టపడి అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఈచిత్రానికి సహా నిర్మాతగా ఉంచడం జరిగింది.

నాగార్జున నుండి మీరు పొందిన ఉత్తమ అభినందన ఏమిటి?

ఈ చిత్రం చూసిన తరువాత, నాగ్ మామ నా తల్లిని పిలిచి ఈ చిత్ర ఎంపికచేసుకోవడం గురించి అలాగే ఈ చిత్రంలో ఆ నటన గురించి చాలా మాట్లాడారు. అదే ఇప్పటివరకు ఆయననుండి అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్.

ఈ చిత్రంలో మేము మీ నుండి కొత్తగా ఏమి చూస్తాము?

ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది, అలాగే నా నిజ జీవితానికి దగ్గర గా వుండే పాత్ర ఇది అందరికి తొందరగా కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రంలో నేను మేకప్ వేసుకోకుండా చాలా సహజత్వంగా నటించాను.

ఈ సినిమా తో పూర్తి గా సంతృప్తి చెందారా ?

నేను ఈ సినిమా చేశానని చాలా ఆనందంగా ఉంది. చి ల సౌ చిత్రాన్ని కుటుంబంలోని అందరు ఆనందంగా చూడవచ్చు. వ్యక్తిగతంగా, యు ఎస్ లో ఉండే నా స్నేహితులకు కూడా ఈ చిత్రాన్ని చూపించగలను. వారికి ఈ బాష మాట్లాడలేకున్నా ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది.

మీ తరువాతి చిత్రాల గురించి ?

ప్రస్తుతం ఒక చిత్రానికి ఓకే చెప్పాను . హాస్యంతో కూడిన థ్రిల్లర్ నేపథ్యంలో సాగె కథ అది ఈ చి ల సౌ చిత్రం తరువాత మళ్లీ ఒక సారి కథ విని ఆ చిత్రాన్ని ఫైనల్ చేస్తాను ఇప్పుడైతే నా కాన్సంట్రేషన్ అంతా ఈ చిత్రం పైనే ఉంది.

సంబంధిత సమాచారం :