ఓ మెసేజ్ ని కమర్షియల్ గా చెప్పి సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న శంకర్, సినిమా కోసం ఏం చేయడానికైనా సై అనే చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ‘ఐ’. సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ విషయంలో పలు రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. తాజాగా మరో అరుదైన రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది.
అసలు విష్యం ఏమిటంటే ‘ఐ’ సినిమా హిందీ వెర్షన్ పాకిస్థాన్ లోని లాహోర్ లో రేపు విడుదల కానుంది. మామూలుగా మన బాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు పాకిస్థాన్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ మొట్ట మొదటి సారిగా ఒక సౌత్ ఇండియన్ తమిళ్ ఫిల్మ్ డబ్బింగ్ వెర్షన్ అయిన హిందీ వెర్షన్ ని లాహోర్ లో రిలీజ్ చేస్తుండడం ఇదే ప్రధమం. ఇప్పటికే బుకింగ్స్ మొదలైన ఈ సినిమా టికెట్స్ కి కూడా ఫుల్ క్రేజ్ ఏర్పడింది.
ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంతా 20 వేలకి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అందులో చైనాలోనే 15,00 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. సెన్సార్ నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ‘ఐ’ సినిమా రన్ టైం 3 గంటల 3 నిమిషాలు(183 నిమిషాలు). విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.


