ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తానంటున్న కమెడియన్

ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తానంటున్న కమెడియన్

Published on May 11, 2015 7:10 PM IST

raghu
ఈ మధ్య కాలంలో నటులుగా నిలదొక్కుకున్న చాలా మంది నటీనటులు నిర్మాతలుగా కూడా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇలాంటి వారి బాటలోకే కమెడియన్ రఘు కరుమంచి కూడా ఎంటర్ అవ్వనున్నాడు. అదుర్స్, ఊసరవెళ్ళి, రేసు గుర్రం మొదలైన సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కమెడియన్ రఘు ఇప్పటి వరకూ 150కి పైగా సినిమాల్లో నటించాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ నవ్వించే ఈ కమెడియన్ కి భవిష్యత్తులో నిర్మాత అవ్వాలనుందని తెలియజేశాడు. అంతే కాకుద్నా ఎవరితో సినిమా చేయాలని ఉందనే కోరికను కూడా బయట పెట్టాడు.

తాజాగా మీడియా తో మాట్లాడిన రఘు ‘భవిష్యత్తులో ఒక నిర్మాతగా మారాలని అనుకుంటున్నాను. అందులోనూ నా మొదటి సినిమాని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేసేలా ప్లాన్ చేసుకుంటున్నానని’ తెలియజేశాడు. ఎన్.టి.ఆర్ తో రఘుకి మొదటి నుంచి మంచి రిలేషన్ షిప్ ఉంది. వీరిద్దరూ ఎంతో సాన్నిహిత్యంగా కూడా ఉంటారు. మరి రఘు కోరికను ఎన్.టి.ఆర్ కూడా నెరవేర్చాలని ఆశిద్దాం.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్వరలో ప్రారంభం కానున్న సుకుమార్ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే లండన్ లో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు