‘ఎన్టీఆర్ బయోపిక్’ పోస్టర్ చూసి కన్ఫ్యూజ్ అయిన విక్టరీ వెంకటేష్ !

‘ఎన్టీఆర్ బయోపిక్’ పోస్టర్ చూసి కన్ఫ్యూజ్ అయిన విక్టరీ వెంకటేష్ !

Published on Sep 21, 2018 8:00 AM IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ నుండి.. చిత్రబృందం నిన్న నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా.. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ, నిన్న ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సుమంత్ ఏఎన్నార్ గెటప్ లో, అచ్చం ఏఎన్నార్ లానే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతుండటం విశేషం. అయితే ఇప్పుడు తాజాగా వెంకటేష్ కూడా ఈ పోస్టర్ పై స్పందించారు.

ఈ పోస్టర్ లో ఏఎన్ఆర్ గెటప్ లో ఉన్న సుమంత్ ని చూసిన తరవాత వెంకటేష్ కన్ఫ్యూజ్ అయ్యారట. తన తాతగారు ఏఎన్నార్ పాత్రలో సుమంత్ పరకాయ ప్రవేశం చేసినట్లు అనిపించిందని.. వెంకటేష్ తన ట్వీటర్ ద్వారా తెలుపుతూ.. ‘‘ఒక్క క్షణం పాటు నేను కన్ఫ్యూజ్ అయ్యా. అతను సుమంతా ? లేక ఏఎన్నారా ? అనేది నాకు అర్థం కాలేదు. ఏఎన్నార్ లెజెండ్ మరియు గొప్ప వ్యక్తి.. ఆయన ఎప్పుడూ మా హృదయాల్లో నిలిచి ఉంటారు’’ అని వెంకటేష్ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు