నేను ఆటో రిక్షాలో స్కూల్ కి వెళ్ళేవాడిని – మహేష్ బాబు

నేను ఆటో రిక్షాలో స్కూల్ కి వెళ్ళేవాడిని – మహేష్ బాబు

Published on Dec 4, 2014 11:39 PM IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు అందరితో అంతగా కలిసిపోయే మనస్తత్వం కాదని, తన కో స్టార్స్ తో సైతం కలవడానికి కొంత సమయం తీసుకుంటాడని మనకు తెలిసిన విషయమే. ఈ అందాల నటుడు ఇటీవలే ఒకపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాల్యానికి సంబంధించిన విశేషాలు తెలిపాడు. తనకు చిన్నప్పటి నుండీ స్టార్ డమ్ అలవాటు పడలేదని, స్కూల్ కి కూడా ఆటో రిక్షాలో వెళ్ళేవాడినని, చదువు పాడవ్వకుండా వేసవి సెలవులలోనే నటించే వాడినని తెలిపాడు

మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు