నాన్న 150వ సినిమాలో నేను నటిస్తాను – రామ్ చరణ్

నాన్న 150వ సినిమాలో నేను నటిస్తాను – రామ్ చరణ్

Published on Jul 6, 2014 10:36 AM IST

ramcharan-and-chiru
ప్రస్తుతం టాలీవుడ్ మరియు మెగా అభిమానుల అందరి చూపు అంతా మెగాస్టార్ చిరంజీవి చేయనున్న 150వ సినిమాపైనే ఉంది. ఈ సినిమాకి ఎవరు దర్శకుడు? ఎలాంటి సినిమా చేయనున్నారు? అనే విషయాలు ఇంకా ఖరారు కాకపోయినా ఈ సినిమా గురించి చర్చలు మాత్రం రోజూ జరుగూనే ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నేను కూడా నాన్న నటించే 150వ సినిమాలో నటిస్తానని అన్నాడు.

‘నాన్న నటించబోయే 150వ సినిమాలో నేను కూడా నటిస్తాను. ఒకవేళ నా పాత్రకి సినిమాలో అవకాశం లేకపోయినా ఎలాగైనా సినిమాలో నేను కనిపించేలా చూడమని దర్శకుడికి చెబుతాను. మా సొంత నిర్మాణ సంస్థలో నిర్మించే ఈ సినిమాకి అమ్మ నిర్మాతగా వ్యవహరిస్తారు. అన్నీ కుదిరితే నాన్న పుట్టిన రోజు నాడు కొత్త సినిమా సంగతులు చెబుతానని’ రామ్ చరణ్ అన్నాడు.

అలాగే మాట్లాడుతూ ‘నాన్నగారికి నచ్చేలా కథ చెబితే కోటి రూపాయలు ఇస్తామని బయట ప్రచారం జరుగుతోంది. మచి కథ చెప్పి, కథలో ఇంకెలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా సెట్స్ పైకి వెళ్లిపోవచ్చు అనుకుంటే కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదని’ రామ్ చరణ్ అన్నాడు.

తాజా వార్తలు