వెండితెరపై తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఆవిష్కరించడానికి ప్రాముఖ్యత ఇచ్చే దర్శకుడు కృష్ణవంశి. ఈ దర్శకుడు కేవలం కుటుంబ కథా సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ‘సింధూరం’లో నక్సలిజాన్ని, ‘డేంజర్’లో యువత మనోభావాలను, ‘అంతఃపురం’లో రాయలసీమ ఫ్యాక్షన్ కక్షలను తనదైన శైలిలో తెరపై చూపారు. తాజాగా కృష్ణవంశి కన్ను అడ్వంచరస్ సినిమాలపై పడింది. ఎప్పటికైనా అడ్వంచరస్ సినిమా తీస్తానని ప్రముఖ పత్రిక సాక్షి ఇంటర్వ్యూలో చెప్పారు.
హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ ‘మెకన్నాస్ గోల్డ్’, సినిమా మేకింగ్ లో నాకు ఒక డిక్షనరీ లాంటిది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం నా నా మనసులో ముద్ర వేసుకున్నాయి. ఎప్పటికైనా ‘మెకన్నాస్ గోల్డ్’ ప్రేరణతో అద్భుతమైన అడ్వంచరస్ సినిమా తీస్తాను. అని కృష్ణవంశి తెలిపారు.
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విజయం తర్వాత కృష్ణవంశి మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. దిల్ రాజు, ప్రకాష్ రాజ్ సంయుక్తంగా నిర్మించే సినిమాకు దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.


