ఆడియన్స్ లా ఆలోచిస్తానంటున్న చైతన్య డైరెక్టర్.!

ఆడియన్స్ లా ఆలోచిస్తానంటున్న చైతన్య డైరెక్టర్.!

Published on Sep 3, 2014 12:41 AM IST

vijay
డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకున్న మొదటి సినిమాతోనే(‘గుండెజారి గల్లంతయ్యిందే’) సూపర్ హిట్ అందుకున్న విజయ్ కుమార్ కొండ తన రెండవ సినిమా ‘ఒక లైలా కోసం’ కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసాడు. నాగ చైతన్య, పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకి సిద్దంగా ఉంది.

విజయ్ కుమార్ కొండ తన మూవీ సక్సెస్ సీక్రెట్ ఆడియన్స్ లా ఆలోచించి సినిమా తీయడమే అని అంటున్నాడు. ‘నేను ప్రేక్షకుడిలా ఆలోచించి సినిమా చేస్తాను, ఎందుకంటే మనం వాళ్ళ కోసం సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళలా ఆలోచించాలి. అప్పుడే వారు ఆశించినదాన్ని మనం స్క్రీన్ పై చూపించగలం. ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో నేను పెట్టిన అడల్ట్ కామెడీ కొంతమందిని ఇబ్బంది పెట్టింది. అందుకే ఈ సారి ఆడియన్స్ ని ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా హెల్దీ కామెడీ ఉండేలా ప్లాన్ చేసుకున్నానని’ విజయ్ కుమార్ కొండ తెలిపాడు.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ లో వచ్చిన ఆల్బంకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు