‘స్వయంవద’లో కూడా ఆకట్టుకుంటా – పోసాని కృష్ణమురళి

Published on May 13, 2019 4:01 pm IST

విలక్షణ నటనతో ఆకట్టుకునే నటుడు పోసాని కృష్ణమురళి ‘స్వయంవద’ సినిమాలో తనదైన శైలిలో విభిన్నమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు వివేక్ వర్మ దర్శకత్వం వహించారు. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వయంవద ఈ నెల 17న విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ సందర్భంగా నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ…’స్వయంవద సినిమాలో నేను జెల్లా వెంకట్రాముడు అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్ర చాలా బాగుంటుంది. విక్రమ్ రెడ్డి అనే వ్యక్తికి నేను బినామీగా ఉండే పాత్ర. అతను చెప్పినట్లు నడుచుకుంటాను. ఈ క్యారెక్టర్ ఒక దశలో స్వయంవద ను రెచ్చగొట్టి కథను మలుపు తిప్పుతుంది. నా పాత్రకు కామెడీతో పాటు కథలో ప్రాధాన్యత ఉంటుంది. స్వయంవద సినిమాలో నటించడం నాకు మంచి అనుభవాన్ని మిగిల్చింది. అన్నారు.

అర్చ‌నా కౌడ్లీ, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌.

సంబంధిత సమాచారం :

More