శంకర్ తో తనను పోల్చొద్దన్న రాజమౌళి !

శంకర్ తో తనను పోల్చొద్దన్న రాజమౌళి !

Published on Apr 12, 2017 4:45 PM IST

Rajamouli
ఎస్ఎస్ రాజమౌళి.. ప్రస్తుతం ఇండియాలోని టాప్ దర్శకుల్లో ఒకరు. ఈ మధ్య కాలంలో ఈయన పేరు వినిపించినంతగా మరే దర్శకుడి పేరూ వినిపించలేదు. ‘బాహుబలి’ చిత్రం ఆయన్ను ఆ స్థానంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ముఖ్యంగా ‘బాహుబలి-2’ ప్రమోషన్లలో రాజమౌళి పేరే ఒక పెద్ద బ్రాండ్ గా మారిపోయింది. దీంతో సహజంగానే ఆయనకు దేశంలో ఉన్న ఇతర టాప్ దర్శకులకు మధ్య పోలిక మొదలైంది.

తాజాగా జరిగిన ఒక ప్రమోషనల్ కార్యక్రమంలో కూడా మీకు శంకర్ గారికి మధ్య ఉన్న పోలికలేంటి అని అడగ్గానే రాజమౌళి వెంటనే దయచేసి తనను శంకర్ తో పోల్చవద్దని ఆయన తనకన్నా చాలా ముందున్నారని అన్నారు. అలాగే శంకర్ ఎన్నో ఏళ్ళ ముందు నుండే అధునాతన టెక్నాలజీని వాడుతున్నారని, తానిప్పుడిప్పుడే సీజీని వినియోగించడం మొదలుపెట్టానని, ఆయన పాకాన తన పేరు ఉండటం ఆనందంగా ఉన్నా ఆయనతో పోల్చడాన్ని మాత్రం ఒప్పుకోనని శంకర్ పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేశారు.

తాజా వార్తలు