
ఎస్.వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రానున్న ‘యమలీల 2’ ఫస్ట్ లుక్ ని నిన్న సాయంత్రం హైదరాబాద్ లో లాంచ్ చేసారు. ఈ సినిమాలో యమధర్మరాజు పాత్రలో డా. మోహన్ బాబు నటించగా, చిత్ర గుప్తుడిగా బ్రహ్మానందం కనిపించనున్నాడు. వీరిద్దరూ కాకుండా కెవి సతీస్, దియా నికోలస్ హీరో హీరోయిన్స్ గా కనిపించనున్నారు.
ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ ‘ఎస్.వి కృష్ణారెడ్డి – అచ్చిరెడ్డి తో కలిసి పనిచేశాక నాకు వీరిద్దరూ బాపు – రమణలా అనిపించారు. వాళ్ళకి ఎప్పుడు కోపం రాదు. యముడిగా యమలీల 2 నా చివరి సినిమా. ఇలాంటి పాత్ర మళ్ళీ చేయకూడదని నిర్ణయించుకున్నానని’ అన్నాడు. బ్రహ్మనందం మాట్లాడుతూ ‘మోహన్ బాబు ఫుల్ యముడి గెటప్ మేకప్ వేసుకోవడానికి 2 గంటల సమయం పట్టేది. ఆయన క్రమశిక్షణకి హ్యాట్సాఫ్ చెప్పాలని’ అన్నాడు.
ఎస్.వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ డైలాగ్ డెలివరీ విషయానికి వస్తే ఎన్.టి.ఆర్ తర్వాత మోహన్ బాబు గారే. మోహన్ బాబు, బ్రహ్మానందం లేకపోతే ఈ సినిమా లేదు, వారికి నా ధన్యవాదాలు. ఇప్పటికి 70% షూటింగ్ మొదలైంది. నా కేరీలో సెకండ్ ఇన్నింగ్స్ కి ప్రారంభమని’ అన్నాడు.

