
శేఖర్ కమ్ముల తన కెరీర్లో మొట్ట మొదటి సారిగా రీమేక్ చేసిన సినిమా ‘అనామిక’. ఈ ఒక్క సినిమాతోనే మరో సారి రీమేక్ సినిమాలను డైరెక్ట్ చేయనని శేఖర్ కమ్ముల రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. వేరే భాష సినిమాని తీసుకొని దాన్ని మన నేటివిటీకి తగ్గట్టు మార్చి తీయడం చాలా కష్టమైన పని అని, అనామిక తీయడానికి చాలా కష్టపడ్డానని ఇందులో తెలిపాడు.
‘ నేను అనామిక డైరెక్ట్ చేయాలనుకోలేదు, ఆ చిత్ర నిర్మాతలే ఈ సినిమా తతో నన్ను అప్రోచ్ అయ్యారు. మొదట్లో నేను ఆ సినిమాపై అంత ఆసక్తి చూపలేదు. ఎప్పుడైతే ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిందో అప్పుడే నా సినిమాల ద్వారా ఏదన్నా మెసేజ్ చెప్పాలని అనిపించింది. దానికి అనామిక స్టొరీ చాలా కరెక్ట్ అనిపించిది. ఎందుకంటే దానిలో మహిళల గురించి చాలా విషయాలను ప్రస్తావించారు. అలాగే నేను ఒక్కడినే నా స్టొరీలు రాసుకోవడానికి ఇష్టపడతాను. కానీ మొదటి సారి ఈ సినిమా కోసం ఇంకో రైటర్ తో కలిసి పనిచేసాను. అప్పుడే అర్థమైంది రీమేక్స్ అనేది చాలా కష్టం అని, ఎందుకంటే స్టొరీ చెప్పడంలో మన స్టైల్ వేరే ఉంటుంది. అందుకే నేను ఇక రీమేక్స్ చెయ్యనని’ శేఖర్ అన్నాడు.
నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో వైభవ్, హర్షవర్దన్ రాణే కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

