2017 లో సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న అల్లరి నరేష్

2017 లో సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న అల్లరి నరేష్

Published on Jun 29, 2014 11:30 AM IST

Allari-Naresh
కామెడీ చిత్రాల దర్శకుడు ఈవివి సత్యనారాయణ తన చిన్న కుమారుడు అల్లరి నరేష్ ని ముందుగా డైరెక్టర్ ని చేద్దాం అనుకున్నారు. కానీ అనుకోకుండా నరేష్ మాత్రం హీరో అయిపోయాడు. ఇప్పటికే చాలా సార్లు నరేష్ తనకి సినిమా డైరెక్ట్ చెయాలనీ ఉందని అన్నాడు.

తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ‘ ఓ సినిమా డైరెక్షన్ చెయ్యాలి అంటే చాలా కష్టమైన పని అలాగే అన్ని విభాగాలపైన ఎంతో అవగాహన ఉండాలి. ఒక నటుడిగా డైరెక్టర్ చెప్పింది చేయడం సులభమైనదే. ప్రస్తుతాని డైరెక్షన్ చేసే అవకాశం లేదు. 2017లో సినిమా డైరెక్ట్ చేస్తాను. కానీ అందులో నేను నటించనని’ అన్నాడు.

అల్లరి నరేష్ గత కొద్ది రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అల్లరి నరేష్ ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి ‘బందిపోటు’, చిన్ని కృష్ణ సినిమాల్లో నటిస్తున్నాడు.

తాజా వార్తలు