‘టు ఇయర్స్’గా డిఫ్రెషన్ లో ఉంటే తనే ధైర్యం చెప్పాడు – తేజ్

Published on Apr 7, 2019 6:14 pm IST

‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ చిత్రంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్‌ విజయ్‌ కృష్ణ ప్రస్తుతం బాలాజీ సనాల దర్శకత్వంలో ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీహరి మంగళంపల్లి, ఎ.పద్మనాభరెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. మేఘా చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ఈ రోజు విడుదలైయింది.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘టీజర్ చాలా బాగుంది. టీమ్ అంతా కలిసి ఒక మంచి సినిమా తీశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలి. లాస్ట్ టు ఇయర్స్ గా డిఫ్రెషన్లో వున్నప్పుడు నవీన్ సపోర్ట్ చేసి ధైర్యం చెప్పాడు. ఒక బ్రధర్ లా గైడ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసాడు. అలాంటి నవీన్ ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నాడు

ఇక ఈ సినిమాలో సోఫియా సింగ్, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ, కెమెరా: జి.లింగబాబు, లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీరమ్య గోగుల.

సంబంధిత సమాచారం :