నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను – నయనతార

Published on Feb 4, 2023 2:46 am IST


స్టార్ కథానాయిక నయనతార ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు అందులో ఆమె పోషించిన సత్యజయదేవ్ పాత్రకు అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దాని తరువాత కనెక్ట్ అనే హర్రర్ యాక్షన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు నయనతార. ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో భాగంగా నయనతార మాట్లాడుతూ, గతంలో తాను కూడా కెరీర్ బిగినింగ్ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్నానని అన్నారు. అప్పట్లో ఒకానొక ప్రాజక్ట్ లో తనకు ఛాన్స్ వచ్చిందని, అయితే వారికి నచ్చిన విధంగా వ్యవహరించాల్సి ఉంటుందని మేకర్స్ చెప్పడంతో అది తన వల్ల కాదని భావించి సున్నితంగా ఆ అఫర్ ని తిరస్కరించానని అన్నారు. అయితే తనమీద తనకు నమ్మడం ఉండడంతో ఆ తరువాత నుండి మంచి అవకాశాలు దక్కాయని ఆమె తెలిపారు. మొత్తంగా క్యాస్టింగ్ కౌచ్ పై నయనతార చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :