నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్ర ఆడియో వేడుక నిన్న సాయంత్రం అతిరథ మహారథుల నడుమ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్, నాగార్జున, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలతో పాటు హీరో నాని కూడ హాజరయ్యారు. ఈ సినిమా గురించి నాని మాట్లాడుతూ ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇంతకుముందు నాతో పనిచేసిన వాళ్ళే, అందుకే నా సినిమాలో నేను లేనే అనే భాధ కలుగుతోంది.
ఈ సినిమాలో నటించే అవకాశం కూడ వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. నాగ్ ‘మహానటి’ చిత్రాన్ని చాలా క్వాలిటీగా తీశారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. మే 9న మనమందరం మహానటి సావిత్రిగారిని చూడబోతున్నాం అన్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు.


