విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఐస్ క్రీమ్ 2’ సినిమా షూటింగ్ దాదాపు ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. ఈ సినిమా ఆడియో విజయవాడలో ‘హాయ్ ల్యాండ్’ రిసార్ట్ లో ఈ నెల 21న జరగనుంది. ఈ విషయం ఆర్.జీ.వి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు
ఈ ఐస్ క్రీమ్ 2 సినిమా రామూ గతంలో తీసిన ఐస్ క్రీమ్ కి సీక్వెల్. ఈ చిత్రంలో జే.డి చక్రవర్తి, నవీనా ప్రధాన పాత్రధారులు. పార్ద్యోధాన్ సంగీతదర్శకుడు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మాత


