ఒకరోజు ఆలస్యంగా రానున్న వర్మ ‘ఐస్ క్రీమ్’

ఒకరోజు ఆలస్యంగా రానున్న వర్మ ‘ఐస్ క్రీమ్’

Published on Jul 8, 2014 6:28 PM IST

ice-cream
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫ్లో కామ్ టెక్నాలజీని పరిచయం చేస్తూ చేసిన హర్రర్ థ్రిల్లర్ ‘ఐస్ క్రీమ్’. నవదీప్, తేజస్వి జంటగా నటించిన ఈ సినిమాని ముందుగా ఈ శుక్రవారం అనగా జూలై 11న రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ తాజా సమాచారం ప్రకారం ఒకరోజు ఆలస్యంగా జూలై 12న రిలీజ్ చేయనున్నారు.

‘ఐస్ క్రీమ్’ సినిమాని అధికారికంగా జూలై 12న రిలీజ్ చేయనున్నామని ట్వీట్ కూడా వేసారు. ఇప్పటికీ ఈ సినిమాలో తేజస్వి ఓ న్యూడ్ సీన్ చేసిందని అలాగే మీడియా మిత్రులకి చూపించిన 20 నిమిషాల సినిమా వలన ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అలాగే రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్స్ తో రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో వర్మ ఈ సారి హిట్ అందుకుంటాడనే అందరూ అంటున్నారు. ప్రేక్షకులను భయపెట్టడమే టార్గెట్ గా పెట్టుకొని చేసిన ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు