చిట్ చాట్ : తేజస్వి – ఆడియన్స్ ని భయపెట్టడమే ‘ఐస్ క్రీమ్’ టార్గెట్.!

Tejaswi

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘హార్ట్ ఎటాక్’, ‘మనం’ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన తెలుగమ్మాయి తేజస్వి హీరోయిన్ గా పరిచయమవుతూ చేస్తున్న సినిమా ‘ఐస్ క్రీమ్’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తేజస్వి ఈ సినిమా విశేషాలను మీడియా మిత్రులతో పంచుకుంది. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) హీరోయిన్ గా మొదటి సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేయడం ఎలా ఉంది?

స) రామ్ గోపాల్ వర్మతో కలిసి పనిచేయడం చాలా గొప్ప అనుభవం. ఆయన దర్శకత్వంలో దొరికేంత ఫ్రీడం మరే దర్శకుడి దగ్గరా దొరకదు. నన్ను ఆయన నటించవద్దు, నువ్వు రియల్ లైఫ్ లో ఎలా ఉంటావో అలానే బిహేవ్ చేయమన్నాడు. అలానే ఈ సినిమా చేసాను.

ప్రశ్న)వర్మ గారి డైరెక్షన్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ నటించారు, అలాగే పరిచయమయ్యారు. అందుకే మీరు ఆయన డైరెక్షన్లో సినిమా చేసారా?

స) రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన డైరెక్షన్ లో చాలామంది స్టార్ హీరోయిన్స్ చేసారు. ఆయన పరిచయం చేసిన వారు కూడా స్టార్స్ అయ్యారు. కానీ నేను ఈ సినిమా చేయడానికి ఇది కారణం కాదు. ఆయనే నన్ను నువ్వు మంచి నటి అని అన్నారు. అలాగే ఆయనే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అందుకే ఈ సినిమా చేసాను.

ప్రశ్న) ఈ సినిమాలో న్యూడ్ గా చేయడానికి గల కారణం ఏమిటి?

స) ఈ సినిమాలో న్యూడ్ సీన్ ఒకటి చేసాను. కానీ అది ఒక ట్రిక్కీ షూట్. రూంలో 4 కెమెరాలు పెట్టారు. నేను ఒక్కదాన్నే లోపల ఉండి నాకు నేనే టెక్, కట్ చెప్పుకొని ఆ సీన్ చేసాను. మేము రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో కూడా అదొక ట్రిక్కీ షాట్ అని మెన్షన్ చేసాం, అలాగే ఫ్లో కామ్ టెక్నాలజీ, మిగతా విషయాలన్నీ వదిలేసి న్యూడ్ న్యూడ్ అనేదాని మీద ఎందుకు పడ్డారు అనేది నాకు అర్థం కాలేదు. అలాగే ఇదేదో పబ్లిసిటీ కోసం చేసింది కాదు, కథ డిమాండ్ చేసింది కాబట్టి ఆ సీన్ చూసాం. ఇక నేను న్యూడ్ గా కనిపించానా లేదా అనేది మీరే చూసి చెప్పాలి.

ప్రశ్న) ‘ఐస్ క్రీమ్’ అనేది హర్రర్ సినిమానా లేక థ్రిల్లర్ సినిమానా?

స) చెప్పాలంటే ఇది హర్రర్ – థ్రిల్లర్ మిక్స్ చేసిన సినిమా. ఎందుకంటే హర్రర్/థ్రిల్లర్ అన్నాను అనుకోండి థ్రిల్లర్ మిస్ అయ్యింది అంటారు, లేదా హర్రర్ మిస్ అయ్యింది అంటారు. ఇందులో కామెడీ, లవ్ ఉంటాయి. ఓవరాల్ గా మా పాయింట్ ఒక్కటే.. ఆడియన్స్ ని భయపెట్టడం.

ప్రశ్న) నవదీప్ తో కలిసి పనిచేయడం ఎలా ఉంది.?

స) నవదీప్ తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు మొదటి సినిమా, తను సీనియర్ యాక్టర్. కానీ తను ఎప్పుడూ సీనియర్ యాక్టర్ అన్న ఫీలింగ్ చూపించలేదు. చాలా కంఫర్టబుల్ గా ఈ సినిమా చేసాం.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలు ఏమిటి?

స) ‘ఐస్ క్రీమ్’ కంటే ముందే నేను ఓ సినిమాకి హీరోయిన్ గా సైన్ చేసాను. కానీ దానికంటే ముందు ఇదే రిలీజ్ అవుతోంది. నేను చేస్తున్న సినిమాకి ‘ఊర్వశివో రాక్షసివో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇందులో నాది సీరియస్ రోల్, సినిమా మొత్తం ఒక్కసారి కూడా నవ్వను. ఇందులో మూడే మూడు పాత్రలు ఉంటాయి. ఒదొక రోడ్ జర్నీ స్టొరీ. ఓంకార్ వాళ్ళ తమ్ముడు ఇందులో హీరోగా చేస్తున్నాడు.

ప్రశ్న) గతంలో మీరు యాక్టింగ్ ని సీరియస్ గా తీసుకోలేదు అన్నారు. ఇప్పుడు యాక్టింగ్ ని సీరియస్ గా ఉన్నారా?

స) ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకున్నాను. కాలేజ్ కి వెళ్లి ఎలా నోట్స్ రాసుకొని చదువుతామో అలాగే ఇప్పుడు యాక్టింగ్ లో కూడా అలా ప్రిపేర్ అవుతున్నాను. ప్రస్తుతం తెలుగు అమ్మాయిలూ పైకి రావాలంటే ఎంత కష్టమో మీకే తెలుసు. ఇప్పుడు నేను ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామనుకుంటున్నాను. అదే తెలుగు అమ్మాయిలు ఎందుకు నటించాకూడదు, ఎందుకు తెలుగమ్మాయి ముంబాయి అమ్మాయిలా అన్నీ చేయలేందు? అనేది నిరూపించాలనుకుంటున్నాను.

అంతటితో తేజస్వికి అల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ని ముగించాం..

Exit mobile version