ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మలయాళ ఆడియెన్స్ లో కూడా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన క్రేజ్ కి బీజం పడేలా చేసిన సినిమా “హ్యాపీ”. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ లవ్ ఎంటర్టైనర్ తెలుగులో అంతగా రాణించలేదు కానీ ఇదే సినిమాకి అల్లు అర్జున్ కి మలయాళ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తీసుకొచ్చి తనని మల్లు అర్జున్ గా మార్చింది.
అయితే అల్లు అర్జున్ ఇప్పుడు తన హ్యాపీ సినిమా రీరిలీజ్ తో మలయాళ ఇండస్ట్రీ దగ్గర హిస్టరీ సెట్ చేసినట్టు మోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ రీరిలీజ్ అయ్యే సినిమాలే తక్కువ అందులో 25 లక్షల గ్రాస్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలు దాదాపు మోహన్ లాల్ నుంచి మాత్రమే ఉంటే తన తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టిన ఒకే ఒక్క హీరోగా అల్లు అర్జున్ నిలిచినట్టు ఇపుడు తెలుస్తుంది. దీనితో మోలీవుడ్ ఇండస్ట్రీ అల్లు అర్జున్ ని ఏ లెవెల్లో ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే హ్యాపీ థియేటర్స్ లో అక్కడ అదరగొడుతుంది.


