బన్నీ నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసింది.

Published on Apr 8, 2020 1:19 pm IST

అల్లు అర్జున్ చేయనున్న తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. ఆయన 21వ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణుతో చేయనున్నారు. ఐకాన్ అనే టైటిల్ కలిగిన ఈ చిత్రానికి కనబడుటలేదు అనేది ట్యాగ్ లైన్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నారు. నిజానికి ఈ చిత్రం బన్నీ అల వైకుంఠపురంలో చిత్రానికి ముందే చేయాల్సింది. అప్పుడు బన్నీ త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపి ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారు. త్రివిక్రమ్ తరువాత మళ్లీ బన్నీ సుకుమార్ తో కమిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది అనుకున్నారు.

కాగా నేడు ఈ మూవీ నుండి అల్లు అర్జున్ కి విశెష్ చెవుతూ బర్త్ డే పోస్టర్స్ విడుదల చేశారు. దీనితో ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మేలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తరువాత శ్రీరామ్ వేణు ఐకాన్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టే అవకాశం కలదు. ఇక నేడు బన్నీ సుకుమార్ తో చేస్తున్న పుష్ప మూవీ ఫస్ట్ లుక్ విడుదల కాగా విశేష స్పందన దక్కించుకుంది.

సంబంధిత సమాచారం :

X
More