చరిత్ర సృష్టించిన చిత్రానికి భారీ రీ-రిలీజ్

Dilwale-Dulhania-Le-Jayenge
భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారిగా 1000వ వారం జరుపుకుంటున్న బాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా ఈరోజు పి.వి.ఆర్ స్క్రీన్ లలో గర్వంగా రీ రిలీజ్ అవుతుంది. 1995లో విడుదలైన ఈ చిత్రం అప్పటికే కాదు ఇప్పటికీ రికార్డులని తిరగరాస్తునే వుంది. షారుఖ్, కాజోల్ జోడి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొంది మోస్ట్ రొమాంటిక్ పెయిర్ గా నిలిచింది

ముంబై మరాటా మందిర్ లో ఇప్పటికీ ఈ సినిమా 19ఏళ్ళగా ప్రసారమవుతునే వుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో యష్ చోప్రా నిర్మాణంలో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. భారతీయ స్క్రీన్ పై ప్రదర్శితమైన సినిమాలలో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోతుంది

Exit mobile version