జూలై నెలాఖరుకు సుమంత్ సినిమా !
Published on Jun 19, 2018 9:46 am IST

హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇదం జగత్’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులు, సినీ వర్గాల నుండి మంచి స్పందన లభించగా ప్రస్తుతం చిత్ర బృందం టీజర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ జూన్ నెలాఖరుకు ఈ టీజర్ విడుదలకానుంది.

అలాగే సినిమా జూలై ఆఖరులో ప్రేక్షకుల ముందుకొస్తుందని సమాచారం. ఈ చిత్రంలో సుమంత్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటిస్తున్నారు. కొత్త తరహా కథ కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం తనకు మంచి విజయాన్ని అందిస్తుందని సుమంత్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న చిత్రాన్ని శ్రీ విగ్నేష్ కార్తిక్ సినిమాస్ పతాకంపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook