‘ధనలక్ష్మీ తలుపు తడితే’ సెన్సార్, రన్ టైం డీటైల్స్

Dhanalakshmi-Talupu-tadith
‘జబర్దస్త్’ టీవీ షో తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ధనా ధన్ ధనరాజ్ ఒక హీరోగా, సహా నిర్మాతగా చేసిన సినిమా ‘ధనలక్ష్మీ తలుపు తడితే’. ధనరాజ్‌ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరోస్ అయిన మనోజ్‌నందం, రణధీర్‌, అనిల్‌ కళ్యాణ్‌, విజయ్‌సాయి హీరోలుగా శ్రీ ముఖి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూలై 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అందులో భాగంగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు ‘ధనలక్ష్మీ తలుపు తడితే’ సినిమాకి క్లీన్ ‘యు’ సరిఫికేట్ ఇచ్చారు. కేవలం సినిమాలో ఓ రెండు మూడు సార్లు వచ్చే కొడకా అనే పదాన్ని మాత్రం మ్యూట్ చేసారు.

ఈ చిత్ర టీం టోటల్ గా 2 గంటల 3 నిమిషాల సినిమాని సెన్సార్ కి పంపారు. కానీ సినిమాలోని కొన్ని సాగదీసిన సీన్స్ ని కట్ చేసి, యాడ్స్ తో కూడా కలుపుకొని 1గంట 59 నిమిషాల సినిమాని రిలీజ్ చేయనున్నామని ధనరాజ్ తెలియజేసాడు. ఈ షార్ట్ రన్ టైం సినిమాకి బిగ్గెస్ట్ హెల్ప్ అవుతుందని ధనరాజ్ అండ్ టీం చాలా నమ్మకంగా ఉన్నారు. మన నిత్య జీవితంలో ప్రతి రోజూ పలు పనులతో ధనలక్ష్మీని వేటాడుతుంటాం. లాంటి ధనలక్ష్మీ ఓ రోజు అనుకోకుండా మీ తలుపు తడితే… అలానే జరిగిన ఓ సంఘటన వలన నలుగురు యువకుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అన్న ఇతి వృత్తంతో తెరకెక్కిన సినిమా ‘ధనలక్ష్మీ తలుపు తడితే’.

యంగ్ హీరో తనీష్ టైటిల్ సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్న ఈ సినిమాకి భోలే శావలి సంగీతం అందించాడు. మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ పతాకంపై అవుట్‌ అండ్‌ అవుట్‌ హిలేరియస్‌ ఎంటర్‌టైనింగ్‌ థ్రిల్లర్‌ ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. సాయి అచ్యుత్‌ డైరెక్టర్.

Exit mobile version