మొదటి నుండి నా శైలిలోనే సినిమాలు తీస్తూ వచ్చాను. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకు ముందు నా గత సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఆ సినిమాల కథలు మంచివే, ఎక్కడో సరిగా తీయకపోవడంతో ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ సమయంలో ఇండస్ట్రీలో అవమానాలు ఎదురయ్యాయి. అప్పుడు అన్నయ్య చిరంజీవి, చరణ్ నామీద నమ్మకం ఉంచారు. ‘గోవిందుడు అందరివాడేలే’ విజయం సాదించడమే కాకుండా, చరణ్ కెరీర్ లో డిఫరెంట్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ నాలో అత్మవిశ్వశాన్ని నింపింది. దర్శకుడిగా నా బలం ఏంటో తెలిసింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. అని అన్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి.
కుటుంబ కథా సినిమాలను తెరకెక్కించడంలో కృష్ణవంశి సిద్దహస్తుడని ‘గోవిందుడు.. ‘ సినిమా మరోసారి నిరూపించింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబిస్తూ దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా విజయ కేతనం ఎగురవేసింది. కలెక్షన్స్ కూడా బాగున్నాయి. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.


