“అఖండ” ఇప్పుడు మిస్సయితే నెక్స్ట్ టార్గెట్ అప్పుడా.?

“అఖండ” ఇప్పుడు మిస్సయితే నెక్స్ట్ టార్గెట్ అప్పుడా.?

Published on May 20, 2021 7:03 AM IST

Akhanda

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. బాలయ్య మరియు బోయపాటి శ్రీనుల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై మాస్ మరియు నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా కోవిడ్ రెండో వేవ్ మూలాన ఈ చిత్రం మిగిలి ఉన్న షూట్ కూడా కాస్త వాయిదా పడింది.

ఇంకా కొన్ని రోజుల మేర మాత్రమే బ్యాలన్స్ ఉన్న ఈ చిత్రం విడుదలపై పలు గాసిప్స్ మళ్ళీ వినిపిస్తున్నాయి. అన్నీ సెట్టయ్యి షూట్ త్వరగా కంప్లీట్ అయితే ఈ చిత్రం విడుదల వచ్చే అక్టోబర్ లో అలా ఉండొచ్చని టాక్ రాగా ఒకవేళ ఇది కనుక మిస్సయితే బాలయ్య టార్గెట్ సంక్రాంతికే అని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఈ చిత్రం విడుదల కోసం బాలయ్య అభిమానులు గట్టిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు