‘కల్కి’ లో అది వర్క్ అవుట్ అయితే బ్లాక్ బస్టరే.

Published on Jun 27, 2019 4:23 pm IST

ప్రశాంత్ వర్మ మొదటి చిత్రం “అ!”తో తానేంటో చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. వివిధ నేపధ్యాలున్న ఒక అమ్మాయి ఆలోచనలు ఒక్కొక్క పాత్రగా మలచి క్లైమాక్స్ లో ఆఅమ్మాయి ఆత్మ హత్యతో కథలో ఉన్న పాత్రలన్నీ ఒకేసారి చనిపోయేలా మలచిన తీరు అద్భుతం. కథ లేకుండా కథనంతో ప్రేక్షకుడిని రెండు గంటలు అలరించడం మాములు విషయం కాదు, “అ!” చిత్రంలో దర్శకుడు తన సరికొత్త స్క్రీన్ ప్లేతో కొత్త అనుభూతిని అందించాడు.

ఈయన తాజాగా యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా తీసిన మరో ప్రయాగాత్మక చిత్రం”కల్కి” రేపు విడుదల కానుంది. ట్రైలర్ చూస్తుంటే కరుడుగట్టిన దుర్మార్గుడైన ఓ ఎం. ఎల్.ఏ తమ్ముడు శేఖర్ బాబు హత్యతో చెలరేగిన హింసాఖాండని ఆపడానికి,ఆ హత్యవెనకున్న వారిని పట్టుకోవడానికి ప్రమాదకరమైన ఓ ఊరిలోకి వచ్చే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ కనిపిస్తున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లేనే ప్రధాన బలంగా కనిపిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ”అ!” మూవీ తరహా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో గనక మూవీని తెరకెక్కించగలిగితే మాత్రం బంపర్ హిట్ కొట్టడం ఖాయం. ట్రైలర్ చుస్తే మాత్రం పక్కాగా హీరో రాజశేఖర్ గరుడ వేగ తరువాత మరో హిట్ కొట్టడతారు అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More