పాత్ర నచ్చితే అటువంటివి మళ్ళి చేయడానికి రెడీ – గోపీచంద్

పాత్ర నచ్చితే అటువంటివి మళ్ళి చేయడానికి రెడీ – గోపీచంద్

Published on Jun 29, 2022 5:03 PM IST

టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ లేటెస్ట్ గా నటించిన మూవీ పక్కా కమర్షియల్. యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలపై యువ నిర్మాత బన్నీ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. జులై 1 న రిలీజ్ కు సిద్ధం అయిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి కర్మ్ చావ్లా ఫోటోగ్రాఫర్. పక్కాగా సాగె యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తప్పకుండా అన్నివర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని అంటున్నారు దర్శకుడు మారుతి.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న హీరో గోపీచంద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా, మాట్లాడుతూ ప్రస్తుతం హీరోగా తాను చేస్తున్న సినిమాలు ఎంతో సంతృప్తినిస్తున్నాయని, అయితే భవిష్యత్తులో మంచి పాత్ర దొరికితే మళ్ళి విలన్ గా చేయడానికి తాను రెడీ అని అన్నారు గోపీచంద్. అలానే తనకు ఎంతో ఇష్టమైన డార్లింగ్ ప్రభాస్ తో కూడా నటించేందుకు సిద్ధం అని, అయితే తామిద్దరినీ కలిపి మూవీ తీసేలా దర్శకుడు ఎవరైనా మంచి కథ తీసుకురావాలని, దానికి కొంత టైం పడుతుందని ఆయన అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు