మహేష్ నుంచి కూడా క్లారిటీ వస్తే వార్ ఇంకో లెవెల్లో ఉంటుంది!

Published on Mar 14, 2021 4:04 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మరో హ్యాట్రిక్ జైత్ర యాత్రను కొనసాగించాలని చేస్తున్న భారీ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా తెలిసిందే. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రం విడుదల కానుంది.

అయితే గత ఏడాది సంక్రాంతికే గట్టి యుద్ధం అందుకుంటే ఈసారి సంక్రాంతి మాత్రం బిగ్గెస్ట్ ఎవర్ సంక్రాంతి యుద్ధంగా నిలవనుంది. ఎందుకంటే ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా “హరి హర వీరమల్లు” రేస్ లో ఉన్నాడు. దీనితో ఈ ఇద్దరు సమ ఉజ్జీల నడుమ యుద్ధం ఇప్పటి నుంచే హీటెక్కిస్తోంది.

అయితే ఈ చిత్రం పై మొదటి నుంచి పాన్ ఇండియన్ విడుదల ఉంటుందా ఉండదా అన్న సంశయంలో ఎట్టకేలకు మేకర్స్ ఆ బిగ్గెస్ట్ రిలీజ్ ను లాంచ్ చేసేసారు. దీనితో ఈ సినిమా లెవెల్ ఆటోమేటిక్ గా మారింది. ఇక మహేష్ చేస్తున్న “సర్కారు వారి పాట” కూడా పాన్ ఇండియన్ రిలీజ్ ఉంటుంది అని కొన్నాళ్లుగా టాక్ వస్తుంది.

ఇక అది కూడా కన్ఫర్మ్ అయితే ఇంకా వచ్చే ఏడాది సంక్రాంతి యుద్ధం నెవర్ బిఫోర్ గా మంచి రంజుగా ఉండడం ఖాయం అని చెప్పాలి. మరి మహేష్ నుంచి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. మరి పవన్ – క్రిష్ ల కాంబోలో వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాను మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా మహేష్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :