ప్రశాంత్ తప్పుకుంటే ఎన్టీఆర్ నెక్స్ట్ ఛాయిస్ అతనే?

Published on May 23, 2020 11:16 am IST

కొద్దిరోజులుగా మీడియాలో కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై వరుస కథనాలు రావడం జరుగుతుంది. దానికి కారణం సొంత పరిశ్రమలో ఆయనపై నిరసనల సెగలు మొదలుకావడమే. ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందని ఆయన పరోక్షంగా చెప్పిన వెంటనే కన్నడ ప్రేక్షకులు ప్రశాంత్ నీల్ పై వ్యతిరేకత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని కన్నడలోనే ఉంటాయని చెప్పడం జరిగింది. దీనితో ఎన్టీఆర్ తో ఆయన మూవీ చేస్తున్నాడా లేడా అనే అనుమానం అభిమానులలో పెరిగిపోయింది.

ఐతే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ క్యాన్సిల్ అయితే మరో టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధంగా ఉన్నారు. స్టార్ హీరోలతో మంచి కమర్షియల్ సినిమాలు తీసే యంగ్ డైరెక్టర్ అట్లీ ఎన్టీఆర్ తో మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మాత అశ్వినీ దత్ ఎప్పటి నుండో వీరి కాంబినేషన్ లో మూవీ చేయాలని సిద్ధంగా ఉన్నారు. దీని సంబంధించిన చర్చలు కూడా జరగడం జరిగింది. మరి కెజిఎఫ్ డైరెక్టర్ తో మూవీ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అట్లీతో ఎన్టీఆర్ తన 31వ చిత్రం చేయవచ్చు.

సంబంధిత సమాచారం :

X
More