రాజశేఖర్‌ కు పోటీ లేకపోయి ఉంటే బాగుండేది !

రాజశేఖర్‌ కు పోటీ లేకపోయి ఉంటే బాగుండేది !

Published on Jun 27, 2019 3:00 AM IST

కంటెంట్ పరంగా అలాగే టీజర్ ట్రైలర్లతో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న కల్కి, బ్రోచేవారెవరురా, బుర్రకథ సినిమాలు పోటీగా ఒకేరోజు జూన్ 28 విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరో రాజశేఖర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘కల్కి’ పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఎక్కువుగానే ఉన్నా.. యూత్ ను గాని బి.సి ప్రేక్షకులను థియేటర్స్ కి ఎంతవరకు రప్పిస్తోందో అనేది ఇప్పుడు పెద్ద డౌట్.

డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఆది సాయి కుమార్ నటించిన ‘బుర్రకథ’ కేవలం బి.సి ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుని వస్తోంది. పైగా ఈ సినిమాకి కూడా పాజిటివ్ బజ్ ఉంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు చేసిన ‘బ్రోచేవారెవరురా’ కూడా బి.సి ఆడియన్స్ తో పాటు ప్రధానంగా స్టూడెంట్స్ ను యూత్ ను టార్గెట్ చేసుకొని వస్తోంది. పైగా శ్రీవిష్ణుతో పాటు నివేత థామస్, నివేత పేతురాజ్, ప్రియదర్శి, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలు కలిసి నటించిన ఈ సినిమా కూడా మొదటి నుండి భిన్నమైన రీతిలో ఆసక్తిని రేపుతోంది.

మరి ఈ రెండు సినిమాలకున్న క్రేజ్ దృష్ట్యా రాజశేఖర్ బాగానే పోటీ ఇవ్వాల్సి ఉంది. అసలు పోటీ లేకపోయి ఉంటే.. కల్కికి కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయ్యేది. మరి యువ హీరోలతో పోటీ పడుతున్న రాజశేఖర్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు